తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా బీజేపీ పై విరుచుకు పడ్డాడు. కేంద్రంలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధిలో సాధించిన పురోగతి శూన్యం అని ఈయన మోదీ పాలనపై రెచ్చిపోయి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలం అయిందని అన్నారు. బీజేపీ ఎంతలా ఫెయిల్ అయిందంటే సరైన పాలన లేకనే కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిందని ఇటీవల జరిగిన ఎన్నికలను గుర్తు చేశారు. ఇక తెలంగాణాలో ఉన్నబీజేపీ నేతలకు కూడా జగదీష్ రెడ్డి చురకలు అంటించారు, రాష్ట్రంపై ఏ మాత్రం మమకారం ఉన్నా కేంద్రం నుండి నిధులను తీసుకురావడంలో మీ చొరవ చూపాలని మాట్లాడారు.
ఇక తెలంగాణాలో కేసీఆర్ ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, అదే విధంగా గుజరాత్ లో అభివృద్ధి ఎలా ఉందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని.. బహిరంగంగా సవాలు విసిరారు మంత్రి జగదీష్ రెడ్డి. మరి జగదీశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తారా ?