ఉత్తర అల్ బతినా లోని ఒక ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు చూస్తే.. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), ఉత్తర అల్ బతినా గవర్నరేట్ లోని సువైఖ్ లోని విలాయత్ లో మూడు వాహనాలకి మంటలు చెలరేగాయి. అయితే వేంటనే అప్రమత్తం అవ్వడం తో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ కి సంబంధించి అగ్నిమాపక బృందాలు సువైఖ్ లోని విలాయత్ లో మూడు వాహనాల్లో మంటలు వచ్చాయని.. వాటిని ఆపివేశామని CDAA ఒక ప్రకటనలో చెప్పింది. అయితే ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఏ ప్రమాదం చోటు చేసుకోకుండానే మంటల్ని ఆర్పివేశారు.