ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం చంద్రబాబుకు అంతగా నచ్చడం లేదు, ఎందుకంటే ఏపీలో పేద ప్రజలు సంక్షేమమా పధకాలను అందుకుంటూ శుభిక్షముగా ఉండడం బాబుకు నచ్చడం లేదని అధికార పార్టీనేతలు అంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణం గురించి ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు చేశాడు. చంద్రబాబు మాట్లాడుతూ మేము అధికారంలో ఉండగానే పోలవరాన్ని 72 శాతం నిర్మాణాన్ని పూర్తి చేశామని..ఇంత చేసినా ఇప్పటికీ వైసీపీ పోలవరాన్ని పూర్తి శాతం 2025 కల్లా పేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. కనీసం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా దాని పైన ఏ ఒక్కరికీ సరైన అవగాహన లేదని మండిపడ్డారు.
ఈరోజుకి కూడా ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేయగలరు అన్నది చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో అధికార పార్టీ ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో తెలిసి కూడా ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు.