– ఇంజినీరింగ్ చేసిన వారికి అద్భుత అవకాశం
– ప్రారంభవేతనం నెలకు రూ.56,100/-
– రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’
మొత్తం ఖాళీల సంఖ్య: 327
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-131, మెకానికల్-135, కంప్యూటర్ సైన్స్-58, ఎలక్ట్రానిక్స్ (అటానమస్ బాడీ) -3 ఉన్నాయి. వీటిలో 31 పోస్టులు పీహెచ్సీ అభ్యర్థులకు కేటాయించారు.
పేస్కేల్: లెవల్ 10 పేమ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. ప్రారంభ మూల వేతనం రూ.56,100/- ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84/10 సీజీపీఏతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయస్సు: 2019, నవంబర్ 4 నాటికి 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని మొదట షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.
రాతపరీక్షను 2020, జనవరి 12న నిర్వహిస్తారు. రాష్టరంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రాతపరీక్షలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
ఇంటర్యూలో కనీసం 60 శాతం మార్కులు వచ్చిన వారిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 4
ఫీజు: రూ.100/-, మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌సీలకు ఎటువంటి లేదు.
వెబ్సైట్: www.isro.gov.in