చిరంజీవి 152 వ సినిమా కథ లీక్‌..

-

మెగ‌స్టార్ చిరంజీవి 151వ చిత్రంగా విడుద‌లైన `సైరా` స‌క్సెస్ అందుకుంది. భారీ బడ్జెట్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇదే ఉపులో చిరంజీవి తన తర్వాత చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 152 వ సినిమా పూజా కార్యక్రమాలు దసరా రోజు నిర్వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.

సోషల్ మీడియాలో వస్తున్న కథ ప్రకారం ఇందులో చిరంజీవి దేవాదయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట… దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ని, అంతేకాకుండా ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకున్నాడు అన్నది మెయిన్ కథగా సాగనుందట. మరి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news