తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోంది : మల్లురవి

-

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫర్ చేంజ్ ఎండ, వానలు లెక్కచేయకుండా 900 కిలోమీటర్ల పైగ చేయదాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు నెరవేర్చకుండా విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రజలకున్న ఆగ్రహాన్ని ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా బయటకు వెళ్లగకుతున్నారని అన్నారు మల్లు రవి. కుల, మత ప్రాంతాలకతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వ బాధితులు ఏకమై మార్పు కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు ఆయన. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని, కానీ వీరు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెత్తందారుల పాలనల్లో అణచివేతకు గురవుతున్న ప్రజలు తిరుగుబాటు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలో గెలిపించడానికి సిద్ధమయ్యారని అన్నారు ఆయన.

Hyderabad: Mallu Ravi hits out at TRS leaders

రాష్ట్రము లో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రశ్నించే అవకాశం లేకుండా స్వేచ్ఛను హరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రశ్నించే గొంతుకల పట్ల పోలీసు, రెవెన్యూ శాఖల వేధింపులు పెరిగిపోయాయని అన్నారు మల్లు రవి. ఇలాంటి క్రమంలో విదేశాలకు వెళ్లి వచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని జ్యోతిష్యం చెప్పడం హాస్యస్పదంగా ఉందని హేళన చేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు వచ్చి ప్రజలు కోరుకుంటున్న మార్పును గమనించి శాస్త్రీయంగా చెబుతున్నామన్నారు ఆయన. మేధావుల్లో రాజకీయ పునరేకీకరణ మార్పు కోసం జరగాలని ఆయన సూచించారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది కేటీఆర్‌లు వచ్చి అడ్డుపడిన ప్రభుత్వం మార్పు అనేది అనివార్యంగా జరుగుతుందన్నారు మల్లు రవి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news