తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఇవ్వాళ సీఎం కేసీఆర్ చాలా ఘనంగా ప్రారంభించనున్నారు. మొదటగా 200 మందికి ఈ సహాయం చేయనున్నారు సీఎం కేసీఆర్.
కాగా 15 బీసీ కులాలకు చెందినవారు సహాయం కోసం tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ లో ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది కేసీఆర్ సర్కార్. వాయిస్ 21 సంవత్సరాలనుంచి 55 సంవత్సరాలు ఏళ్ళు ఉండి… గ్రామాలలో లక్షన్నర, పట్టణాల్లో రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈ అర్హతలు ఉన్నవారు ఈనెల 20 లోపు ఈ పథకం కోసం అమలు చేసుకోవాలని ఆదేశించింది కెసిఆర్ సర్కార్. కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని.. ఆ డబ్బులతో ఏదైనా పనిముట్లను కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.