దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవం

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 21 రోజుల పాటు రోజుకో శాఖ అధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గురువారం రోజున ఊరూర చెరువుల పండుగ నిర్వహించారు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంబురాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఫించన్లు, కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల కింద చేసిన ఖర్చు, వాటి ఫలితాలను వివరిండంతో పాటు లబ్దిదారుల అనుభవాలు చెప్పేలా కార్యక్రమాలు రూపొందించారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ వృత్తి పనుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం సహా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కణ్నుంచే పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నల్గొండ జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ గొర్రెల పంపిణీ  మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news