ఆంధ్ర‌జ్యోతికి జ‌గ‌న్ భారీ షాక్

-

వైసీపీ అన్నా, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నా ఎప్పుడు రుస‌రుస‌లాడిపోయే ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. జ‌గ‌న్ దెబ్బ‌తో ఆంధ్ర‌జ్యోతికి తగిలిన షాక్ మామూలుగా లేదు. ఐదేళ్ల టీడీపీ స‌ర్కార్‌ను ఆంధ్ర‌జ్యోతి మీడియా ఓ రేంజ్‌లో భుజానికి ఎత్తుకుని మోసింది. టీడీపీని కంటికి రెప్ప‌లా కాపాడేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన జ్యోతి ప్ర‌య‌త్నాలు అన్ని ఈ ఎన్నిక‌ల్లో తుస్సుమ‌న్నాయి. రాధాకృష్ణ బాబు కోసం అటు తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌తో, ఇటు ఏపీలో జ‌గ‌న్‌తోనూ వైరుధ్యం కొని తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది… జ‌గ‌న్ సీఎంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూములను రద్దు చేసింది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు. బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతికి విశాఖ న‌డిబొడ్డున ప‌ర‌దేశిపాలెంలో ఉన్న 1.5 ఎక‌రాల భూమిని చాలా కారుచౌక‌గా కేటాయించారు.

ఆ భూమి విలువ మార్కెట్ రేటు ప్ర‌కారం సుమారుగా రు.40 కోట్లు ఉంది. అయితే ఒక అరెక‌రం రు.5 వేల‌కు, మ‌రో ఎక‌రం రు. 50 ల‌క్ష‌ల‌కే కేటాయించారు. అంటు రు.39.5 కోట్ల మేర ప్ర‌భుత్వానికి భారీ న‌ష్టం జ‌రిగింది. ఇక ఆంధ్ర‌జ్యోతికి ఇప్ప‌టికే విశాఖ‌లో సంస్థ కార్య‌క‌లాపాల కోసం కావాల్సినంత భూమి కూడా ఉంది. అయితే బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన భూమిని ఇత‌ర అవ‌సరాల కోసం వాడే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ భూ కేటాయింపు ర‌ద్దు చేయ‌డంతో పాటు అక్క‌డ బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఇక జ్యోతికి బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన భూ కేటాయింపు ర‌ద్దుపై స‌మాచార శాఖా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆంధ్ర‌జ్యోతి మీడియా సంస్థ‌లు కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే ఆ భూమిని వాడేందుకు సిద్దమైనట్టు తెలుస్తోందన్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విష ప్ర‌చారం చేస్తున్నందుకే బాబు ఆ మీడియా సంస్థ‌ల‌కు ఈ భూమి కేటాయించార‌ని కూడా పేర్ని విమర్శించారు. మ‌రి దీనిపై రాధాకృష్ణ కొత్త ప‌లుకులో ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news