టర్మినేటర్ (డార్క్ ఫేట్) ట్రైల‌ర్ చూసి విజ‌య్ థ్రిల్ మాములుగా లేదుగా…!

-

హాలీవుడ్ హిట్ మూవీస్ లో ట‌ర్మినేట‌ర్ సిరీస్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఆ సిరీస్ నుంచి టర్మినేటర్ (డార్క్ ఫేట్)అనే చిత్రం నవంబ‌ర్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రం హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తెలుగు తెలుగు వ‌ర్ష‌న్‌ను క్రేజీ హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి డిస్ని సంస్థ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్ పాల్గొన్నారు..

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…
“టర్మినేటర్ డార్క్ ఫేట్ ట్రైలర్ నేను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. టెర్మినేటర్ సిరీస్‌లో ఇది ఐదోవది. నేను హాలీవుడ్ సినిమాలను ఇంగ్లీష్ వెర్షన్ లో చూసేవాడిని. ఫ్రెండ్ కోసం ‘300’ను తెలుగు డబ్బింగ్ లో చూశా. అప్పట్లో డబ్బింగ్ వింతగా ఉండేది. ఇప్పుడు డిస్నీ వాళ్లు క్వాలిటీగా డబ్బింగ్ చేస్తున్నారు. ‘టెర్మినేటర్ జడ్జిమెంటల్ డే’ సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన ట్రైలర్ ఇది. సినిమా కోసం మీలాగే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేం. మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. టెర్మినేటర్ సిరీస్‌ చిత్రాలన్నీ విజయం సాధించాయి. అలానే టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా కూడా కలెక్షన్లపరంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్న. హాలీవుడ్ సినిమాలు మాచేత ప్రమోషన్ చేపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సినిమాలను కూడా హాలీవుడ్‌లో ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. డిస్నీ కంపెనీ వాళ్లు వాళ్ల టెక్నాలజీని టాలీవుడ్‌కు అందించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news