కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్ షా ఫోకస్ మొత్తం తెలంగాణ పైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బిజెపి దూకుడు పెంచింది. ఇకనుంచి ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా కూడా రాష్ట్రంలో పలుమార్లు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.
ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు అమిత్ షా. ఈ పర్యటనలో బిజెపి సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం పై ఆయన దిశ నిర్దేశం చేయనున్నారు. అనంతరం భద్రాచలం రాములవారిని దర్శించుకుని.. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఈ బహిరంగ సభను సక్సెస్ చేయాలని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి. బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉన్నారు.