ఇల్లందులో భారీ ట్విస్ట్..హరిప్రియ ప్రత్యర్ధి ఎవరు?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కోట అని చెప్పవచ్చు. అక్కడ పలు స్థానాలు కమ్యూనిస్ట్ కంచుకోటలుగా ఉన్నాయి. అలాంటి స్థానాల్లో ఇల్లందు కూడా ఒకటి. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కమ్యూనిస్టులకు చెందిన పార్టీలు..10 సార్లు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు గెలిచింది. ఒకసారి టి‌డి‌పి గెలిచింది. ఇక కమ్యూనిస్టుల్లో గుమ్మడి నరసయ్య అయిదుసార్లు గెలిచారు.

ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో కాంగ్రెస్ నుంచి బానోత్ హరిప్రియ పోటీ చేశారు. బి‌ఆర్‌ఎస్ పార్టీపై 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమె తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. నెక్స్ట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో బి‌ఆర్‌ఎస్ లో ఉన్న కోరం కనకయ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలోకి వచ్చారు.

2014లో ఈయన ఇల్లందు నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక హరిప్రియ బి‌ఆర్‌ఎస్ లోకి రావడంతో కనకయ్యకు ప్రాధాన్యత తగ్గింది. సీటుపై గ్యారెంటీ లేదు. దీంతో పొంగులేటితో పాటు పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు.

అయితే కాంగ్రెస్ లో చేరితే ఇల్లందు సీటు కనకయ్యకు ఇవ్వాలని పొంగులేటి ప్రతిపాదన పెట్టారు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ ఇంచార్జ్ చీమల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన సీటు ఆశిస్తున్నారు. దీంతో ఇల్లందు కాంగ్రెస్ సీటుపై ట్విస్ట్‌లు ఉన్నాయి. కానీ నేతలు ఏకమై పనిచేతే ఇల్లందులో హరిప్రియకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి హరిప్రియ ప్రత్యర్ధిగా ఎవరు ఉంటారో.

Read more RELATED
Recommended to you

Latest news