ప్రయాణికులకు షాక్.. ఆ టికెట్‌ ధరల్ని పెంచిన TSRTC

-

తెలంగాణ ఆర్టీసీ కరోనా తర్వాత నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. అయితే ఈ క్రమంలోనే ప్రయాణికులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. అయితే తాజాగా మాత్రం టీఎస్ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్‌ ప్రస్తుత ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్‌ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్‌ సిటిజన్ల (పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ.90 చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ధరలు జూన్‌ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో టీ-24 టికెట్‌ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్‌ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని పునరుద్ధరిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news