ఆధార్-పాన్ లింక్ చెయ్యకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి..?

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఎలాంటి ప్రభుత్వ సేవలు పొందాలన్నా, ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా కూడా ఆధార్‌, పాన్‌ కార్డ్‌ తప్పక ఉండాలి. అందరు తప్పక పాన్ ని ఆధార్ ని లింక్ చేయాలి. ఆదాయ పన్ను శాఖ జారీ చేసే ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ పాన్.

12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్ ని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జరీ చేస్తుంది. పాన్-ఆధార్ లింకింగ్ గురించి, స్టేటస్‌ గురించి ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. పాన్ ని దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు ఆధార్ నంబర్‌ను కోట్ తప్పక చేయాలి. ఇది ఇలా ఉంటే 2023 జులై 1 నుంచి ఆధార్‌ను పాన్‌ తో లింక్‌ చేయక పోతే, పాన్‌ ఇనాక్టివ్‌ అవుతుంది. ఇక అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురు అవుతాయి అనేది చూద్దాం.

ఇలా జరిగితే PAN లకు సంబంధించి ఎలాంటి రీఫండ్‌లు అందవు. అలానే ఎలాంటి రీఫండ్‌లపైనా వడ్డీ పొందడానికి కుదరదు. చట్టం ప్రకారం TDS అలానే TCS ని ఎక్కువ రేటుతో డిడక్ట్‌ చేస్తారు. పాన్ కార్డు ని మళ్ళీ యాక్టివ్ చేయాలంటే పాన్‌ పని చేయని 30 రోజులలోపు ఆధార్‌ను నిర్దేశించిన అధికారికి చెప్పాలి. అలానే రూ.1,000 ఫీజు చెల్లించాలి. పాన్ పనిచేయకపోతే, రిటర్న్‌లను ఫైల్ చేసేందుకు అవ్వదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను పొందడానికి అవ్వదు. ట్యాక్స్‌ డిడక్షన్‌ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news