మొబైల్ ఫోన్ కి కింద హోల్ ఎందుకు ఉంటుంది..?

-

స్మార్ట్ ఫోన్ ని ప్రతి ఒక్కరు ఈరోజుల్లో ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ని ప్రతి చిన్న పనికి కూడా వాడుతున్నారు. నిజానికి స్మార్ట్ ఫోన్ కి ప్రతి ఒక్కరూ అలవాటు పడిపోయారు మార్కెట్లోకి రోజు రోజుకీ కొత్త ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. మొబైల్ కంపెనీలు రకరకాల మోడల్స్ ని తీసుకు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు నిజానికి ఇటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా అద్భుతంగా ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ కి చిన్న హోల్ అనేది ఇస్తూ ఉంటారు అయితే ఈ హోల్ వలన పెద్ద ఉపయోగమే ఉంది. ఊరికే ఒక చిన్న రంధ్రాన్ని ఫోన్ కి పెట్టలేదు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చేది అందువలన అవతలి వ్యక్తి మాట్లాడే మాట క్లియర్ గా వినిపించేది కాదు అదే నాయిస్ డిస్టబెన్స్.

ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లలో మొదట వచ్చిన ఈ సమస్య మళ్ళీ కలగలేదు ఎందుకంటే తర్వాత వచ్చిన స్మార్ట్ఫోన్లకి చిన్న హోల్ అనేది ఇచ్చారు. ఆ రంధ్రం లో మినీ మైక్రోఫోన్ ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ గా ఇది పనిచేస్తుంది. దానివలన ఫోన్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ గా పని చేస్తుంది. దాని వలన ఫోన్ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం కూడా ఉండదు క్లియర్ గా మాట వినపడుతుంది. ఫోన్ లోపలికి ఎయిర్ కోసం అని చాలామంది అనుకుంటారు కానీ అది ఎయిర్ కోసం కాదు ఇలా నాయిస్ కోసం.

Read more RELATED
Recommended to you

Latest news