2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి 2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అదే రోజు రాష్ట్రవతరణ దినోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కెసిఆర్ పాలనను భరించే ఓపిక ఇక ప్రజలకు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే ప్రస్తుతం ఉన్న అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇక కెసిఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. కేసీఆర్ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు.