వరల్డ్‌కప్ గెలవడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు పాక్ బ్యాటర్ రిజ్వాన్. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ICC ఈవెంట్లలో పాక్ పై భారత్ దే పైచేయిగా ఉంది 2021 టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ గెలవడంపై పాక్ బ్యాటర్ రిజ్వాన్ తాజాగా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ ను ఓడించడం ప్రపంచ కప్ ను గెలవడంతో సమానం కాదు. వరల్డ్ కప్ గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని చెప్పారు. కాగా, ఇవాళ్టి నుంచి వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ప్రారంభo కానున్నాయి. ఇండియాలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం రేపటి నుంచి జింబాబ్వే క్వాలిఫైయర్ మ్యాచులు జరగనున్నాయి.
వరల్డ్ కప్ కి అర్హత సాధించేందుకు 10జట్లు పోటీ పడనున్నాయి. ఇందులో టాప్-2 జట్లకు మాత్రమే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, నేపాల్, USA ఉండగా… గ్రూప్-Bలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, UAE ఉన్నాయి.