రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి పిఎం కిసాన్ 14వ విడత పెట్టుబడి సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లలో రూ. 2000 చొప్పున కేంద్రం జమ చేసే అవకాశం ఉంది. ప్రతి ఏటా కేంద్రం మూడు విడతల్లో రూ.6000 జమ చేస్తోంది. అయితే 13వ విడతలో వెరిఫికేషన్ కానీ కారణంగా రూ. 2000 అందుకొని రైతులకు ఈసారి రూ. 4000 చొప్పున అకౌంట్లలో పడనున్నాయి.
కాగా, ఫిబ్రవరిలో కేంద్రం 13వ విడత నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. బెల్గామ్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 13విడత వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు 14వ భాగం విడుదలకు సమయం అయ్యింది. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్‌లో లబ్దిదారుని అయితే ఎలా తనిఖీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నట్లయితే .. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి. లబ్దిదారుల స్థితిని చూడవచ్చు.