ఉద్యోగులు, ప్రభుత్వం వేరువేరు కాదు – బొప్పరాజు

-

విశాఖ: నేడు రెవెన్యూ భవన్ లో ఏపీ జెఏసీ అమరావతి జోన్-1 అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వలిశెట్టి దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. ఏపీ జెఏసీ అమరావతి ఉద్యమం విజయవంతం అయిందన్నారు. 92రోజుల ఉద్యమంలో మేం ఎక్కడ లొంగిపోయామో..? అమ్ముడు పోయామో విమర్శలు చేసే వాళ్ళు చెప్పాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా వెనక్కి తగ్గిన నాయకులే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగులు, ప్రభుత్వం వేరువేరు కాదన్నారు బొప్పరాజు. ఉద్యోగ సంఘాల పోరాటాలను.. రాజకీయ ఆందోళనలు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యమాలతో ముడిపెట్టి చూడటం సరైన విధానం కాదన్నారు. ముఖ్యమంత్రి సానుకూల ధృక్పథంతో మా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయన్నారు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news