నారా లోకేష్ కి ఎమ్మెల్యే మేకపాటి సవాల్

-

నెల్లూరు జిల్లా: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. నేడు ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం..టైం, ప్లేస్ చెప్పాలని లోకేష్ కి సవాల్ విసిరారు. ఆత్మకూరులో అభివృద్ధి ఏమి లేదని మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి నిజాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

మేము సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టిడిపి.. ఇప్పుడు మా పథకాలనే కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. 2014 లో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రాష్ట్రం విడిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదు..? అని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం పాకులాడిన ఆనం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదన్నారు. హై లెవల్ కెనాల్ కు మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావు పేట ఎంపీ గా వున్నప్పుడు ఆయన ప్రతిపాదన చేస్తే.. రాజశేఖర్ రెడ్డి హయాంలో దానికి రూప కల్పన జరిగిందన్నారు.

తనకు మంత్రి పదవి ఇచ్చిన వారితో పాటూ సోమశిల హై లెవల్ కెనాల్ కు కారణమైన వారి గురించి ఆనం అసలు మాట్లాడక పోవడం సరికాదన్నారు. ఇసుక, మట్టి ద్వారా అవినీతి జరిగిందన్న ఆనం ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. సొంత అభివృద్ధి కోసమే 40 ఏళ్ల నుంచి ఆనం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ సభల కోసం ప్రజలకు డబ్బులు ఇచ్చినా ప్రజలు రాలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news