హైదరాబాద్ పట్టణంలో, మన భాగ్యనగరంలో బోనాల పండుగ మొదలైందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ రోజు జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు ఈ పండుగ ఘనంగా జరుపుకుంటామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నామన్నారు. 15 కోట్లు బోనాల పండగకు సీఎం కేసిఆర్ బడ్జెట్ ప్రకటించడం జరిగిందని తెలిపారు.
అలాగే 3036 దేవాలయాలకు 11 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో వర్షంతో దేవుడు స్వాగతం తెలిపారని అన్నారు. ఇవ్వాళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి వెలిగించడం జరుగుతుందన్నారు. అందరూ సహకరించి పండగను నిర్వహించుకోవాలని సూచించారు.