ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తారా? అంటే నో డౌట్ మళ్ళీ ఆయనే గెలుస్తారు..వైసీపీకే అధికారం వస్తుందని చెప్పి పలు సర్వేలు చెబుతున్నాయి. సర్వేలే కాదు..మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా అదే. సంక్షేమ పథకాలతో తమ జీవితాలని బాగుచేసిన జగన్ అధికారంలోకి వస్తేనే బెటర్ అని జనం భావిస్తున్నారు. పథకాలతో తమ ఆర్ధిక పరిస్తితి కొంతమేర మెరుగు పడిందని భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చే పథకాలు మళ్ళీ రావాలంటే జగనే రావాలని కోరుకుంటున్నారు.
అయితే జగన్ ఓటు బ్యాంకే సంక్షేమ పథకాల లబ్దిదారులు అని సర్వేలు చెబుతున్నాయి. వారే మళ్ళీ గెలిపించనున్నారు. ఇక అందులోప్రధానంగా జగన్ కు అండగా ఉండే వర్గాలు..రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు..వీరే మరొకసారి జగన్‌ని అధికారంలోకి తీసుకొస్తారని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ వర్గాలతో పాటు బీసీ, కాపు..ఇతర అగ్రవర్గాలు సైతం జగన్‌కు అండగా నిలిచారు. దీంతో ఆయనకు భారీ గెలుపు వచ్చింది. అయితే ఈ సారి ఆ స్థాయిలో గెలుపు రాకపోవచ్చు కానీ గెలుపు మాత్రం ఖాయమని తెలుస్తుంది.
గత ఎన్నికల్లో బీసీలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి ఓట్లు వేశారు..కానీ ఈ సారి ఫిఫ్టీ-ఫిఫ్టీ అన్నట్లు ఉన్నారు. టిడిపి-జనసేన పొత్తు ఉంటే కమ్మ, కాపు, క్షత్రియ వర్గాలు మెజారిటీ అటు వైపే ఉంటాయి. ఇక జగన్‌కు అండగా నిలిచేది రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు ఇప్పటికీ ఆ ఓట్లు మెజారిటీ సంఖ్యలోనే జగన్ కు మద్ధతు ఇస్తున్నారట.
సంక్షేమ పథకాలతో వారు జగన్ పక్షాన నిలుస్తున్నారు. కాకపోతే ఆ మధ్య జగన్..కాస్త బిజేపితో కలిసి మెలిసి ఉన్నారనే భావన కాస్త మైనస్ అయింది. కానీ ఇటీవల మళ్ళీ బిజేపి వర్సెస్ వైసీపీ అన్నట్లు పోరు మారింది. దీంతో మళ్ళీ ఆయా వర్గాలు జగన్ వైపే ఉన్నారు. దీంతో జగన్ మళ్ళీ గెలవడం ఖాయమని అంటున్నారు. జగన్ విక్టరీ ఫార్ములా కూడా ఇదే అని తెలుస్తుంది.