మోదీకి “టోస్ట్” సంప్రదాయం గురించి వివరించిన బైడెన్

-

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు.. అధ్యక్ష దంపతులు ఘన స్వాగతం పలికారు. మోదీ గౌరవార్థం వైట్​హౌస్​లో బైడెన్ దంపతులు విందు ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్​లో సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ‘టోస్ట్‌’ సంప్రదాయన్ని ఎలా పాటించాలో బైడెన్‌ ప్రధాని మోదీకి వివరించారు.

టోస్ట్‌కు పిలుపునిచ్చే సమయంలో మాట్లాడుతూ ‘‘మిస్టర్‌ పీఎం.. మీరు ఆల్కహాల్‌ తీసుకోకపోతే ఎడమ చేత్తో టోస్ట్‌ గ్లాస్‌ తీసుకోవాలి. ఈ విషయాన్ని మా తాతయ్య ఆంబ్రోస్‌ ఫెన్నిగాన్‌ చెప్పేవారు. నేను జోక్‌ చేయడంలేదు. జిల్‌, నేను నేడు ప్రధాని మోదీతో అద్భుతంగా గడిపాం. ఇది చాలా ఫలవంతమైన పర్యటన. ఈరోజు రాత్రి అమెరికా- భారత్‌ మధ్య ఉన్న గొప్ప మైత్రిని గౌరవించుకొంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పక్కనే కుడిచేత్తో గ్లాస్‌ పట్టుకొని నవ్వుతూ ఉండిపోయారు.

ఈ విందులో మోదీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ఆస్కార్‌ గెలుపొందిన ‘నాటు నాటు’ పాటను ప్రస్తావించారు. ‘‘భారత్‌, అమెరికన్లు తమ సంప్రదాయాలను పరస్పరం మరింత మెరుగ్గా అర్థం చేసుకొంటున్నారు. హాలోవిన్‌ రోజున భారత్‌లో పిల్లలు స్పైడర్‌మెన్‌గా మారిపోతున్నారు. మరోవైపు అమెరికాలో యువత ‘నాటు నాటు’ ట్యూన్లకు స్టెప్పులేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news