పిఠాపురంలో నాపై పోటీ చేయ్.. పవన్‌‌ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

-

పిఠాపురంలో నాపై పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌‌ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ విసిరారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ‘మీ అభిమానుల చేత బండబూతులతో మెసేజ్ లు పెట్టిస్తున్నారు. గోచి, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. మీరు సినిమాల్లో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదన్నది గ్రహించండన్నారు.

దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది. కాకినాడలో పోటీ చేయకపోతే, పిఠాపురం నుంచి నాపై పోటీ చేయండి అని’ సవాల్ విసిరారు.మీరు మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం అని చెప్పారు. మీ బెదిరింపులకు భయపడి నేను లొంగుబాటుకు రానని..గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండని సవాల్‌ చేశారు. నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news