నేడు అమిత్‌షా, హర్‌దీప్‌సింగ్‌తో KTR భేటీ

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌… ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి KTR ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీలను కలవనున్నారు. రసూల్ పుర వద్ద 4 ఎకరాల హోంశాఖ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలయింపుపై అమిత్ షాతో కేటీఆర్ చర్చించనున్నారు.

అనంతరం హర్దీప్ సింగ్ పురితో సమావేశమై లకిడికపూల్-BHEL, నాగోల్-L.B.నగర్ వరకు మెట్రో రైలు ఏర్పాటు, పఠాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణపై చర్చిస్తారు.

ఇక పాట్నా విపక్షాల సమావేశంపై స్పందించిన కెటిఆర్…బీజేపీ ,కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం చేశాయని ఆగ్రహించారు. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామమని… స్వాతంత్య్ర భారత దేశంలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోడీ అని వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రగా మేము జాతీయ రాజకీయాలు చేస్తామని… ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే ఆర్డినెన్సు ను మేము వ్యతిరేకిస్తామని తెలిపారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news