గ్రూప్‌-4 పరీక్షలో వేలిముద్ర తప్పనిసరి.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పునఃపరీక్షలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా టీఎస్పీఎస్సీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్‌పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్‌ పత్రాల్ని అందజేస్తారని తెలిపింది. గ్రూప్‌-4 రాతపరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యల అమల్లో భాగంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారని వెల్లడించింది. హాజరుపట్టీలో ఫొటోను.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. భారీసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్‌ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news