తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులతో ‘లూలూ గ్రూప్’ కార్యకలాపాలు

-

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా రాష్ట్రంలో రూ.3500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లుగా లూలూ గ్రూప్ యాజమాన్యం తెలిపింది. కేటీఆర్‌ సమక్షంలో లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ పెట్టుబడుల కార్యాచరణ ప్రకటించారు. “తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. రూ.300 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్‌ మాల్‌ ప్రారంభిస్తాం” అని యూసఫ్‌ అలీ వెల్లడించారు.

భారత్‌లో లులూ గ్రూప్‌ పెట్టుబడులు పెడుతున్నందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సంస్థలతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మెుదటి స్థానంలో ఉందని పునరుద్ఘాటించారు. త్రివేండ్ రెవల్యూషన్ వై ట్రివల్యూషన్ థింక్ రెవల్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ సంస్థ పెట్టబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news