పలుచని జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే సరి..!

-

కొంత మంది జుట్టు చాలా పలుచగా ఉంటుంది దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా జుట్టు రాలిపోవడం ఒత్తుగా లేకపోవడం వంటివి.. అయితే పురుషులు జుట్టు ఎక్కువగా ఊడిపోతూ పలచగా అయిపోతూ ఉంటుంది. అలానే కొంత మంది స్త్రీల లో కూడా ఈ సమస్య ఉంటుంది అయితే ఈ సమస్య తో బాధపడుతున్నట్లయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి.

ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి ఆందోళన విశ్రాంతి లేకపోవడం మొదలైన కారణాల వలన జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలి పోవడం వలన జుట్టు పలుచబడిపోతుంది నుదురంతా కూడా కనబడుతూ ఉంటుంది. జుట్టు రాలిపోవడం వలన కాన్ఫిడెన్స్ కూడా బాగా దెబ్బతింటుంది. జుట్టు పలచగా అయిపోతున్నట్లయితే ఈ చిట్కాలని పాటించండి అప్పుడు జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది.

హెయిర్ ఫాలికల్స్ కి రక్త ప్రహాన్ని మెరుగుపరచడానికి ఉల్లి రసాన్ని క్రమం తప్పకుండా మాడు మీద రాసుకుని మస్సాజ్ చేస్తూ ఉండండి అప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది ఒత్తైన జుట్టు ని పొందాలంటే ఉల్లి రసం తీసుకోండి. ఉల్లి రసాన్ని కుదళ్ళకి రాసి మృదుగా మసాజ్ చేస్తే కురులు బాగా ఎదుగుతాయి. ఒత్తైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు గుడ్లు కూడా బాగా పనిచేస్తాయి.

ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ వంటివి ఇందులో ఎక్కువ ఉంటాయి జుట్టు రాలే సమస్య నుండి ఇవి దూరం చేస్తాయి. కాబట్టి తలకి మీరు గుడ్ల ని కూడా అప్లై చేసుకోవచ్చు కొబ్బరి పాలు కూడా జుట్టుకి బాగా హెల్ప్ అవుతాయి కొబ్బరి పాలని తలకి రాసి ఒక అరగంట పాటు వదిలేసి తర్వాత తల స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news