టైటాన్‌ ట్రాజెడీ.. సముద్ర గర్భంలో ‘వరల్డ్ రికార్డు’ కోసమే

-

అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటాన్ సబ్​మెరైన్ పేలిన ఘటనలో పాకిస్థానీ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌తోపాటు ఆయన కుమారుడు సులేమాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పారు. రూబిక్‌ క్యూబ్‌ అమర్చడంలో ఎంతో ప్రావీణ్యమున్న సులేమాన్‌.. సముద్ర గర్భంలో దాన్ని వేగంగా అమర్చి ప్రపంచ రికార్డు సాధించాలనుకున్నాడని అతడి తల్లి తెలిపారు.

‘రూబిక్స్‌ క్యూబ్‌ అమర్చడంలో సులేమాన్‌కు ఎంతో ప్రావీణ్యం ఉంది. టైటాన్‌లో ప్రయాణించే సమయంలో సులేమాన్‌ దాన్ని వెంట తీసుకెళ్లాడు. ఎందుకంటే, సముద్ర గర్భంలో దాన్ని పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించాలని అనుకున్నాడు. ఇందుకోసం ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు’కు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేపట్టే ఈ యాత్ర గురించి వారికి తెలియజేశాడు. దీనిని రికార్డు చేసేందుకు సులేమాన్‌ తండ్రి షెహజాదా దావూద్‌ కూడా ఓ కెమెరాను వెంట తీసుకెళ్లారు’ అని క్రిస్టైన్‌ దావూద్‌ పేర్కొన్నారు. యాత్రకు ముందు కొన్ని క్షణాల ముందు తమతో వారిద్దరూ ఎంతో ఉత్సాహంగా గడిపారని.. కొన్ని గంటల తర్వాత తీవ్ర విషాదం నింపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news