మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..18 మంది విటులు అరెస్ట్‌

-

బంజరా హిల్స్ లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న..18 మంది విటులు అరెస్ట్‌ అయ్యారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార నిర్వహిస్తున్న స్పా సెంటర్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.. ముగ్గురు నిర్వాహకులు పదిమంది యువతలు 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు.

బంజర హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ముగ్గురు నిర్వాహకులు. పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్ ను ఏర్పాటు చేసిన రాయల శృతి, రమణ ,జాహెద్… వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు… పట్టుపడిన యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news