ప్రిగోజిన్‌కు ప్రాణహాని.. అప్రమత్తంగా ఉండాలని CIA వార్నింగ్

-

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ గ్రూప్​ అధిపతి ప్రిగోజిన్‌కు ప్రాణహాని ఉందని అమెరికా నిఘా సంస్థ CIA వార్నింగ్ ఇచ్చింది . ముఖ్యంగా తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని CIA చీఫ్‌ డేవిడ్‌ పేట్రాయస్‌ పేర్కొన్నారు. పుతిన్‌ విరోధులు చాలా మంది ఇలా కిటికీల నుంచి కింద పడి చనిపోయారని తెలిపారు. ప్రిగోజిన్‌ ఆవేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడనీ ఆపై వెనక్కి తగ్గి ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని చెప్పారు.

వాగ్నర్‌ గ్రూప్‌ను ప్రిగోజిన్‌ చేజార్చుకున్నాడని వివరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత 19 మంది రష్యా ప్రముఖులు మరణించారు. ఇందులో పుతిన్ విమర్శకులు చాలా మంది ఉన్నారు. రష్యా ఎంపీ పావెల్‌ అంటోవ్‌ భారత్‌ ఒడిశా రాష్ట్రంలోని ఓ హోటల్‌ మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించారు. రెండు రోజుల్లోనే మరో రష్యన్‌ భారత్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. క్రెమ్లిన్‌కు ఎదురు నిలిచిన వారు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సోవియట్‌, రష్యా చరిత్రలో చాలా ఉన్నాయి అని సీఐఏ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news