ఆంద్ర్రదేశ్ లో 2024 లో ఎన్నికలు జరగనుండడంతో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు వ్యూహ రచనలో మునిగి ఉన్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, టీడీపీ మాత్రం ఎలాగైనా ఈసారి అధికారం సాధించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నేతలతో ఒక సమీక్షను నిర్వహించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇంచార్జి ల నియామకం మరియు నేతల పనితీరును పరిశీలిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే కొన్ని చోట్ల సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు ఉండడంతో వాటిని పరిష్కరించుకుంటూ సమీక్షను కొనసాగిస్తున్నారు.
ఇక ఎన్నికలలో టీడీపీ గెలవడానికి అవసరం అయిన అన్ని ప్రయత్నాలు చెయ్యాలని నేతలకు సూచించారు చంద్రన్న. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి సేవలను అందిస్తూ వారి మనసును గెలుచుకోవాలని నేతలను ఆదేశించారు.