తెలంగాణ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందని కొద్దీ రోజుల క్రితం తెలుసుకున్న అనంతరం మీడియా ముఖంగా తెలియచేయడంతో… స్పందించిన తెలంగాణ ప్రభుత్వం నిన్న ఉదయం డీజీపీ ఆదేశాల మేరకు మేడ్చల్ డీసీపీ సందీపరావు ఈటల ఇంటికి వెళ్లి ప్రాణహాని ఉందన్న విషయం ఎలా తెలిసింది అని పూర్తి వివరాలను తెలుసుకుని విచారణ చేయించడంతో, అది నిజమని తేలింది. దీనితో కాసేపటి క్రితమే కేసీఆర్ ప్రభుత్వం ఈటలకు వై ప్లస్ భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ భద్రతలో భాగంగా ప్రభుత్వం నుండి ఈటల రాజేందర్ కు ఇకపై ఒక బులెట్ ప్రూఫ్ కారు మరియు 16 మంది సెక్యూరిటీ గా ఉండనున్నారు. మరి ఈ భద్రతను ఎప్పటి వరకు కొనసాగనిచనున్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విపక్షాలకు చెందిన నాయకుడు అయినప్పటికీ చాలా తొందరగా భద్రతను కల్పించడం నిజంగా హర్శించదగిన విషయం.