ధర్మపురిలో ఉద్రిక్తత.. గోమాతను వధించిన కేసులో కౌన్సిలర్

-

ధర్మపురిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోమాతను వధించిన కేసులో కౌన్సిలర్ ఇరుకున్నాడు. అయితే ఈ అంశం పై బండి సంజయ్ స్పందించారు.బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో గురువారం పట్టపగలే, అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం అని ఫైర్ అయ్యర్ బండి సంజయ్.

ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయం. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయం అన్నారు. గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ, చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని చెప్పారు.

తాను నిఖార్సైన హిందువునని, భయంకర హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్, ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఎత్తివేసి, అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో రేపు నేనే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు కేసిఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నానని పోస్ట్ పెట్టారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news