తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో చంద్రబాబు హస్తం ఉంది అనేది ఫాల్తు మాటలు అని కేంద్రమంత్రిబండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎన్నికపై.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
నారా చంద్రబాబునాయుడు కారణంగానే ఎన్ రామచందర్రావు కు బిజెపి తెలంగాణ అధ్యక్ష పదవి వచ్చిందని ప్రచారం కూడా జోరు అందుకుంది. అయితే దీనిపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. అవన్నీ ఫాల్తూ ముచ్చట్లు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదు
అధిష్టానం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించలేదన్నారు. ఎవరికి వాళ్ళు చంద్రబాబు ప్రకటించాడు, ఎవరో ఇంకొక ఆయన ప్రకటించారు అంటే కాదు…అందరూ నామి నేషన్ వేశాక ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది అని పేర్కొన్నారు బండి సంజయ్.