మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ విడుదల చేయగా తాజాగా టైటిల్ ని కూడా ఖరారు చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో రకరకాల వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరొకవైపు ఈ సినిమాలో ఆమె పాత్రను తగ్గించి శ్రీ లీలా పాత్రను పెంచడంతో భరించలేక ఆమె సినిమా నుంచి తప్పుకుంది అన్న వార్తలు కూడా వినిపిస్తూ వున్నాయి. మరొకవైపు ఈ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ కూడా తప్పుకున్నాడని వార్తలు వినిపించడం గమనార్హం. ఇక అలా ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. అందులో భాగంగానే రీసెంట్గా ఒక కీలక షెడ్యూల్ ని కూడా చిత్ర బృందం పూర్తి చేసింది. అనుకున్న సమయం కంటే ముందుగానే షెడ్యూల్ ని వారు పూర్తి చేసినట్లు సమాచారం.
ఇకపోతే ఇప్పుడు తాజాగా సినిమా నుంచి మరొక అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా షెడ్యూలు 20 రోజులపాటు గ్యాప్ లేకుండా కొనసాగబోతోందని ఇందులో శ్రీ లీలాతో పాటు మీనాక్షి చౌదరితో కూడా మహేష్ బాబు సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక జగపతిబాబు విలన్ గా రమ్యకృష్ణ , ప్రకాష్ రాజు, రఘు బాబు , సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.