నిఖిల్​కు షాక్.. ‘స్పై’ సెకండ్​ డే కలెక్షన్స్ డౌన్​

-

వరుస హిట్లతో సూపర్ ట్రాక్​లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా యాక్షన్ థ్రిల్లర్ ​ ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం రోజున విడుదలైన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కిన విషయం తెలిసిందే. టాక్​, రివ్యూస్ ఎలా ఉన్నా సరే.. బక్రీద్ సెలవు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తొలి రోజే ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు మూవీటీమ్​ అధికారికంగా ప్రకటించింది. అంటే షేర్ రూ.ఏడు కోట్ల వరకు వచ్చి ఉంటుంది. రూ.18కోట్ల వరకు బిజినెస్​ చేసుకున్న ఈ సినిమాకు.. రికవరీ మొదటి రోజే బాగా జరిగిపోయింది. కానీ సెకండ్ డే కలెక్షన్లు మాత్రం డీలా పడిపోయాయి.

రెండో రోజు ఆశించిన రీతిలో చిత్రానికి స్పందన రాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఈ చిత్రానికి రూ.1.50 -1.70 కోట్లు షేర్‌ను మాత్రమే వచ్చిందట. వరల్డ్ వైడ్‌గా రూ. 2.10 – 2.30 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం అందింది. కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్​ అందుకుంటుందో లేదో తెలియాలంటే ఈ ఆదివారం గడవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news