ఈ రోజు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా వెస్ట్ ఇండీస్ చావో రేవో మ్యాచ్ లో స్కాట్లాండ్ తో ఆడుతూ ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ 43 .5 ఓవర్ లపాటు ఆడి పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు చాలా పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. కేవలం హోల్డర్ 45 మరియు షెపర్డ్ 36 లు మాత్రమే విండీస్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ ముల్లెన్ 3, సోల్ , వాట్ మరియు గ్రీవ్స్ లు తలో 2 వికెట్లు సాధించారు. ప్రస్తుతం స్కోటాలాండ్ ఛేజింగ్ లో భాగంగా ఒక్క వికెట్ కోల్పోయి సునాయాసంగా లక్ష్యానికి చేరువగా వెళుతోంది. ఈ మ్యాచ్ లో కనుక విండీస్ ఓడిపోతే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారి వరల్డ్ కప్ ఆడకుండా చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ విధమైన ఆటతీరును కనీసం ఏ ఒక్క విండీస్ అభిమాని కూడా ఊహించి ఉండరు అని చెప్పాలి. ఇటీవల జింబాబ్వే తోనూ ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకుంది.