ఇండియా క్రికెట్ మెయిన్ జట్టు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో చాలా బిజీగా ఉంటుంది. కాగా అదే సమయంలో చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ ఆసియ గేమ్స్ లో ఇండియా కూడా క్రికెట్ లో పాల్గొనబోతోంది, కానీ ఈ టోర్నీకి ఇండియా బి టీం ను పంపాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరియు ఈ సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో కార్తీక్ మాట్లాడుతూ టీం ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై పొగడతల వర్షం కురిపించాడు. త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్ లో ఇండియా జట్టును ముందుండి నడిపించే అవకాశం అశ్విన్ కు ఇవ్వాలని అనుకుంటున్నాను.
ఇందుకు తగిన అన్ని అర్హతలు అశ్విన్ లో ఉన్నాయని నమ్ముతున్నానన్నారు. మరి ఈ కార్తీక్ ఆలోచనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందా అన్నదే సందేహం.