సింగరేణి ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

-

సింగరేణి ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్. జాతీయస్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు జీతాలను తక్షణమే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలను నేడు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. డైలీ రేటెడ్ కేటగిరీ-1 ఉద్యోగి మూలవేతనం గతంలో రోజుకు రూ.1011.27 ఉండగా, ఇప్పుడు రూ. 1502.66 అయింది. మంత్లీ రేటెడ్ ఏ-1 గ్రేడ్ ఉద్యోగి మూలవేతనం గతంలో నెలకు రూ.98,485.79 ఉండగా, ప్రస్తుతం రూ.1,46,341.67కి పెరిగింది.

ఇది ఇలా ఉండగా, సమాజ్ వాది పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి BRS హాజరుకాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కాగా, గతంలోనూ పలుమార్లు వీరిద్దరూ సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news