నిన్న జరిగిన ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ఏ ఒక్క విషయం తప్పు అని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న దొరల పాలనను ఇకపై రానివ్వం అన్నాడు రాహుల్ … అందులో తప్పు లేదు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను రానివ్వం. మేము చెబుతున్న ప్రతి ఒక్క హామీని 100 శాతం నెరవేరుస్తామన్నారు.. గతంలో పెన్షన్ రూ. 75 మాత్రమే ఉండేది, దానిని రూ. 200 చేసిన ఘనత మాదే అన్న విషయం మర్చిపోకండి అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు. నిన్న ఖమ్మం సభలో మేము ఇచ్చిన పెన్షన్ హామీని ససేమిరా అమలు చేసి తీరుతాం అన్నాడు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం బాగా పెరిగింది… ఇపుడు పెన్షన్ ను రూ. 4000 కు పెంచడం పెద్ద కష్టం కాదన్నారు. సూర్యుడు ప్రతిరోజూ ఉదయించే దిక్కు మారినా సరే మేము ఈ హామీని మాత్రం మరువబోమన్నారు.
ఇందులో ఎవ్వరికి అయినా ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే చర్చకు రావాలని సవాలు చేశాడు రేవంత్ రెడ్డి.