ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆలోపే ఈ ఏడాది డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన నివాసంలో ఐప్యాక్ టీమ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులు, తాజా పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం తీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు,ఎమ్మెల్యేల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇవ్వగా, దీనిపై జగన్ చర్చించారని తెలస్తోంది. గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వంటి అంశాలతో పాటు ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై చర్చ జరిపారని తెలుస్తోంది.