ఎటువంటి అంచనాలు లేకుండా 2018లో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రం KGF.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2022 లో వచ్చిన సెకండ్ పార్ట్ మరింత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మంచి పాపులారిటీ సంపాదించినది. దాదాపుగా 1500 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు సాధించి ఇండియన్ టాప్ మూవీలలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోగా యశ్ నటించారు.
ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను చాలా ఉత్కంఠ పరిచేలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్లో రిలీజ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జూలై 14 వ తేదీన KGF -1, 2 చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీ – రిలీజ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో హీరో యశ్ అక్కడ అభిమానుల కోసం ఒక స్పెషల్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో యశ్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటుందని తెలియజేయడం జరుగుతోంది.
ఇక జపాన్ లో RRR చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా ఎంతటి ప్రభావాన్ని సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా రజనీకాంత్ రికార్డును బ్రేక్ చేయడం బాహుబలి సినిమా వల్ల కూడా కాలేదు. RRR చిత్రం ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా కే జి ఎఫ్ -1,2 చిత్రాలు RRR చిత్రంతో పోటీపడి మరి కలెక్షన్లు సాధిస్తాయని అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. అయితే కేజిఎఫ్ సినిమా రిలీజ్ వెనుక సలార్ సినిమా కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram