బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాల సంబరాలకు హాజరు కానున్నారు. జులై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ అనే నగరంలో ‘భారత జాగృతి ఆస్ట్రేలియా’ ఆధ్వర్యంలో బోనాల సంబురాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు మరియు ఎంపీలు పాలుపొందనునట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటె, జులై 16న న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నగరంలో జరగనున్న బోనాల సంబరాలలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు అని తెలిసింది. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాల వేడుకలు జరుగనున్నాయి. అక్లాండ్‌లోని గణేష్ టెంపుల్లో ఉదయం 11 గంటలకు ఈ సంబరాలు ప్రారంభమవుతాయి అని సమాచారం . అలాగే అక్లాండ్లో ఉదయం 9 గంటలకు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో కవిత పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆస్ట్రేలియాలోని తెలంగాణీయులతో ఆమె సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుందని సమాచారం.