పురపాలక శాఖలో భారీగా కమిషనర్లను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాలు సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 22 మంది అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయం నుంచి బి.గీత రాధికను జీహెచ్ఎంసీకి బదిలీ చేసిన ప్రభుత్వం.. సీడీఎంఏ కార్యాలయంలో సంయుక్త సంచాలకులుగా టి.కృష్ణమోహన్ రెడ్డిని బదిలీ చేసింది. బడంగ్ పేట కార్పోరేషన్ కమిషనర్ గా బి.సుమన్ రావు, రామగుండం కమిషనర్ గా సిహెచ్. నాగేశ్వర్ బదిలీ అయ్యారు. మీర్ పేట కమిషనర్ గా ఏ.వాణి, ఖమ్మం కమిషనర్ గా బి.సత్యనారాయణరెడ్డిని బదిలీ చేశారు. తుర్కయాంజల్ కమిషనర్ గా సిహెచ్. శ్రీకాంత్… జీహెచ్ఎంసీకి కె.నారాయణరావు… పాల్వంచ కమిషనర్ గా ఏ.స్వామి బదిలీ అయ్యారు.
ఇబ్రహీంపట్నం కమిషనర్ గా పి. రవీంద్ర సాగర్.. నాగారం కమిషనర్ గా జి.రాజేంద్ర కుమార్… ఘట్ కేసర్ కమిషనర్ గా ఎండి. సాబెర్ అలీను బదిలీ చేశారు. మిర్యాలగూడ కమిషనర్ గా ఎం.పూర్ణచందర్… పెద్ద అంబర్ పేట కమిషనర్ గా ఎస్. రవీందర్ రెడ్డి… నందికొండ కమిషనర్ గా కె.వేణుమాధవ్ బదిలీ అయ్యారు. పోచారం కమిషనర్ గా పి.వేమన్ రెడ్డి… రామగుండం డిప్యూటీ కమిషనర్ గా ఆర్.త్రయంబకేశ్వర్ రావు… దమ్మాయిగూడ కమిషనర్ గా ఎస్.రాజమల్లయ్యను బదిలీ చేశారు. హుస్నాబాద్ కమిషనర్ గా ఎం.ఆర్.రాజశేఖర్… కొత్తపల్లి కమిషనర్ గా ఏ. వెంకటేశ్ బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ కమిషనర్ గా ఏ.సురేష్, జీహెచ్ఎంసీకి మహమ్మద్ యూసుఫ్ ను బదిలీ చేశారు.