ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో కొందరు మహిళలు మిస్ అవ్వడానికి వాలంటీర్లే కారణం అనడంతో పెద్ద రచ్చ నడుస్తుంది. దీంతో వైసీపీ నేతలు, వాలంటీర్లు పవన్ పై విరుచుకుపడుతున్నారు. అటు పవన్ కూడా వెనక్కి తగ్గడం లేదు.
పదే పదే వాలంటీర్లపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్ష నాయకులు నీచమైన మాటలతో విరుచుకుపడుతున్నారని YCP ట్విట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై రాళ్లు విసురుతున్నట్లు కార్టూన్ షేర్ చేసింది. ‘వీరి ప్రభుత్వం వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట! ప్రజలంతా మళ్ళీ పథకాలు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీ లాంటి వ్యవస్థను తీసుకొస్తారట!’ అని తెలిపింది.
ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!
వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి… pic.twitter.com/Xjp4qU1hJu— YSR Congress Party (@YSRCParty) July 16, 2023