ఎలాన్ మస్క్, జుకర్​బర్గ్ కలిసిపోయారు.. ఇదిగో ప్రూఫ్

-

గత కొంతకాలంగా ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ మధ్య బహిరంగ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ఇద్దరు కేజ్ ఫైట్​కు సై అంటే సై అని సవాల్ విసురుకున్నది చూశారు కదా. అయితే తాజాగా ఈ ఇద్దరు కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అదేంటి.. నిన్నటి దాకా నిప్పు ఉప్పులా ఉన్న వాళ్లు.. ఇప్పుడు కలిసిపోవడం ఏంటని అనుకుంటున్నారా. అదంతా ఏఐ మాయ.. అదనేండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ.

ఓ యూజర్‌ AI సాయంతో మస్క్‌, జుకర్‌బర్గ్‌ కలసి ఉన్నట్లుగా ఫొటోలు తయారు చేశాడు. ‘మంచి ముగింపు’ అంటూ క్యాప్షన్ జోడించి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. బీచ్‌లో ఓ జంట ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లుగా అచ్చం అలాగే వీటిని సృష్టించాడు. ఇద్దరు బిలియనీర్లు చట్టాపట్టాలు వేసుకొని బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు, ఒకరిని ఒకరు హగ్​ చేసుకున్నట్లు, ఇద్దరూ బీచ్‌లో గంతులేస్తున్నట్లు ఎంతో అందంగా వీటిని తయారు చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news