Saindhav : వెంకటేష్ ‘సైంధవ్’ ఫస్ట్ లుక్

-

ప్రస్తుతం శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ ‘సైంధవ్’ అనే ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. క్రితం ఏడాది ‘ఎఫ్ 3’ సినిమాతో ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాగే ‘ఓరి దేవుడా’ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా.

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో వెంకటేష్ ను ఓ పాప హత్తుకుని ఉండగా, ఆయన సీరియస్ గా చూస్తున్నారు. కాగా, ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లో రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలొ ఈ మూవీ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news