ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన భద్రాచలం లో కేసు నమోదు అయింది. పూర్తి వివరాల ప్రకారం భద్రాచలం కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కేసీఆర్ పై భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలకమైన కారణాలను వెల్లడించారు. గత సంవత్సరం ఇదే రోజుల సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనకు వచ్చారు.. ఆ పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలకు గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ కరకట్ట ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు, పైగా ఈ నిర్మాణం కోసం కేసీఆర్ రూ. 1000 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం విశేషం. ఇంకా ఈ వరదల వలన నిరాశ్రయులైన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటికి సంవత్సరం అయినా ఈ రెండు హామీల గురించి ఏమంత స్పదన లేదు అని పొదెం వీరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటను ఒక సీఎంగా నెరవేర్చడంలో విఫలం కావడంతో పోలీసుల సహాయాన్ని ఎమ్మెల్యే కోరడం ఇక్కడ సంచలనంగా మారింది. మరి ఈ ఫిర్యాదుపైన భద్రాచలం పోలీసులు ఏమైనా చర్య తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.