కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నేతలు దుర్మరణం

-

ఈ మధ్య తరచూ విమానాలు కుప్పకూలడం.. లేదా అకస్మాత్తుగా పలు కారణాలతో పేలి పోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విమాన ప్రమాదాల్లో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ఓ దేశంలో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా ఐదుగురు రాజకీయ నేతలు దుర్మరణం చెందారు. వారి మరణంతో ఆ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంతకీ ఎక్కడంటే..?

కొలంబియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన పార్టీలో సభ్యులు అని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ దేశ సివిల్‌ ఎవియేషన్‌ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మృతిచెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news